రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన జంగపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్‌కుమార్ పరామర్శించారు. పార్టీ తరఫున రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వాగులో మూడు నెలల క్రితం శ్రీనివాస్ గల్లంతై మృతిచెందారు.
శ్రీనివాస్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం. వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపడతాం. శ్రీనివాస్ భార్యకు ఉపాధి కల్పిస్తాం. రాష్ట్రంలోని ప్రతీ తెరాస కార్యకర్తను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు.