కరోనా రెండో దశ తీవ్రతతో లాక్డౌన్ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో దర్శనాలను రద్దు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడిని ఆలయ అధికారులు మూసివేశారు.
లాక్డౌన్తో వేములవాడ రాజన్న గుడికి తాళం.!
రాష్ట్రంలో లాక్డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చిన రంగాలు మినహా మిగతా అన్ని ఉదయం 10 గంటల తర్వాత మూతపడుతున్నాయి. ఆలయాల్లో దర్శనాలు రద్దు చేయాలనే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయాన్ని అధికారులు మూసివేశారు.
లాక్డౌన్తో వేములవాడ రాజన్న దర్శనం రద్దు
ఈ పదిరోజుల పాటు ఆలయంలో భక్తులకు అనుమతి లేదని.. ఈవో కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:తెలంగాణకు తాళం పడింది.. అమల్లోకి వచ్చిన లాక్డౌన్..