వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కల నెరవేరనుంది. పట్టణ సమీపంలోని 6 మండలాలలోని 15 రెవెన్యూ గ్రామాలతో కలిపి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రాథమిక ప్రకటన జారీ చేసింది. ఇప్పటివరకు సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేది. భూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వెళ్లేందుకు ఖర్చుతో పాటు సమయం ఎక్కువగానే పడుతుందని స్థానికులు పేర్కొన్నారు.
రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ - VEMULAWADA REVENUE DIVISION Declared by Telangana government
వేములవాడ ప్రజల చిరకాల కల నెరవేరనుంది. చాలా సంవత్సరాలుగా వేములవాడను రెవెన్యూ డివిజన్‌గా గుర్తించాలని పలు రాజకీయ పార్టీలు, రైతులు కోరుతూ వచ్చారు. ఎట్టకేలకు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక ప్రకటన జారీ చేసింది. 30 రోజుల్లోపు ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం కల్పించింది.

రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవశ్యకతను వివరించారు. కాంగ్రెస్, భాజపానాయకులు కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ
ఇదీ చదవండిఃభారీగా ఐఏఎస్‌ల బదిలీలు... కొత్త పోస్టింగ్‌లు ఇవే...