రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రేపు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ కల్యాణం జరపనున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 20 నుంచి ఆలయాన్ని మూసివేసి పూజలు మాత్రమే కొనసాగిస్తున్నారు.
భక్తులు లేకుండానే వేములవాడ రాజన్న కల్యాణం - శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం
వేములవాడ రాజన్న ఆలయం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైంది. కరోనా కారణంగా గతనెల 20 నుంచి ఆలయాన్ని మూసివేసి పూజలు చేస్తున్నారు. ఈసారి భక్తులు లేకుండానే స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

భక్తులు లేకుండానే వేములవాడ రాజన్న కళ్యాణం
కళ్యాణానికి భక్తులను అనుమతించడంలేదు. రథోత్సవాన్ని కూడా రద్దు చేయనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, యాగశాలలో సీతారామచంద్ర మూర్తి ఆలయంలో హోమం చేపట్టారు. గురువారం ఉదయం ఎదుర్కోళ్లు అనంతరం సీతారామ కల్యాణం నిర్వహించనున్నారు.
భక్తులు లేకుండానే వేములవాడ రాజన్న కళ్యాణం
ఇదీ చూడండి:పది మందికి నెగిటివ్.. ఇద్దరు డిశ్చార్జ్