తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్నకు కాసులవర్షం.. నెల రోజుల్లో 7.81 కోట్ల ఆదాయం - వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం

కార్తీకమాసం సందర్భంగా వేములవాడ రాజన్నకు భారీ ఆదాయం వచ్చింది. నెల రోజుల్లో 7.81 కోట్లు ఆదాయం గుడికి సమకూరింది.

Breaking News

By

Published : Nov 29, 2019, 12:04 PM IST

రాజన్నకు కాసులవర్షం.. నెల రోజుల్లో 7.81 కోట్ల ఆదాయం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా కాసుల వర్షం కురిసింది. నెల రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో శివున్ని దర్శించుకున్నారు. ఆలయంలోని వివిధ విభాగాలు, హుండీల ద్వారా నెల రోజుల్లో 7.81 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది కంటే ఈసారి 2.75 కోట్లు అదనంగా వచ్చాయి. గతమాసం 29 నుంచి ఈ నెల 26 వరకు రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి.

మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చారు. పర్వదినాల్లో పెద్ద ఎత్తున భక్తులు కానుకలు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details