దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో హుండీలు చిల్లర నాణేలతో నిండిపోయాయి. ఈ క్రమంలో భక్తులు కానుకలు సమర్పించేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఆలయానికి భక్తుల నుంచి కానుకల రూపంలో ఏటా 18 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో సుమారు 2కోట్ల రూపాయల వరకు చిల్లర నాణేలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.
రాజన్న ఆలయంలో హుండీలు చిల్లర మయం! - తెలంగాణ వార్తలు
రాజన్న ఆలయంలో హుండీలు చిల్లర నాణేలతో నిండిపోతున్నాయి. భారీ స్థాయిలో చిల్లర వచ్చి చేరతుండడంతో... హుండీలు త్వరగా నిండిపోతున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న క్రమంలో చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు సైతం ఆసక్తి చూపడం లేదని ఆలయ అధికారులు తెలిపారు.
రాజన్న ఆలయంలో చిల్లరతో నిండిపోతున్న హుండీలు
ఇటీవల డిజిటల్ చెల్లింపులు పెరగడంతో చిల్లర నాణేల వినియోగం తగ్గింది. దీంతో బ్యాంకులు చిల్లర నాణేలు డిపాజిట్ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే చిల్లర నాణెలతో హుండీలు త్వరగా నిండుతున్నాయని వెల్లడించారు. జనవరి 27వ తేదీన హుండీలు లెక్కించగా కోటి 50 లక్షల ఆదాయం సమకూరిందని... మరిన్ని హుండీలను నేడు లెక్కిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి కృష్ణప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి:కేసీఆర్కు అరుదైన బహుమతి.. జోరుగా 'కోటి వృక్షార్చన'