తెలంగాణ

telangana

ETV Bharat / state

పునః దర్శనాలపై రాజన్న ఆలయ ఈవో ఏమంటున్నారంటే?

ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా దర్శనం కల్పిస్తున్నట్లు... వేములవాడ రాజన్న ఆలయ ఈవో రామకృష్ణ రావు తెలిపారు. లాక్​డౌన్​ అనంతరం... శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో తిరిగి భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో చేపడుతున్న ఏర్పాట్లపై ఆలయ ఈవో రామకృష్ణ రావు తో ఈటీవీ భారత్ ముఖాముఖి...

vemulawada-rajanna-temple-eo-ramakrishna-rao-interview
'ఆర్జిత సేవలు రద్దు... కేవలం శీఘ్రదర్శనమే'

By

Published : Jun 8, 2020, 7:18 PM IST

ప్ర. ఆలయంలో భక్తులకు దర్శనాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు.?

జ. ఆలయంలో భక్తులు కనీసం దూరం పాటించేలా ఆరడుగులకు ఒక గడిని ఏర్పాటు చేశాము. దర్శనానికి వచ్చే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నాము. ప్రతి భక్తుడు శానిటైజ్​ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాము. ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లపై దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సైతం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్ర. ఆలయంలో కోడె మొక్కులు, ఆర్జిత సేవలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?

జ.ఆలయంలో కోడె మొక్కులు ఆర్జిత సేవలను రద్దు చేసి... కేవలం శీఘ్రదర్శనం కల్పిస్తున్నాం. ఆలయంలో ఆర్జిత సేవలు చేసుకోవాలంటే భక్తులు ఆన్​లైన్​లో బుక్​ చేసుకోవాలి. అప్పుడు వారి పేరు మీద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ప్ర. దర్శనాలు చేసుకునే భక్తులకి ఆలయంలో తీర్థప్రసాదాలు ఇస్తున్నారా?

జ. దర్శనం చేసుకున్న భక్తులకు ఎలాంటి తీర్థప్రసాదాలు అందించడం లేదు. నిష్క్రమణ క్యూలైన్లలో భక్తులకు ప్రసాదాలు విక్రయించేందుకు అందుబాటులో పెట్టాం.

ప్ర. ఆలయంలోని ప్రత్యేక ఏర్పాట్ల దృష్ట్యా ఎంత మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నారు? భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది?

జ. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు దూరం పాటించేలా ఏర్పాట్లు చేశాము. ఈ నేపథ్యంలో భక్తులకు దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది. ఆలయంలోని అన్ని విభాగాల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆలయ అనుబంధ ఆలయాల్లోనూ ఇటువంటి ఏర్పాట్లు చేశాము.

ప్ర. ప్రత్యేక ఏర్పాట్లు ఏమి చేశారు?

జ. క్యూ కాంప్లెక్స్​లతో పాటు ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్​ చేస్తున్నాము. వృద్ధులను, పిల్లలను దర్శనానికి అనుమతించడం లేదు.

'ఆర్జిత సేవలు రద్దు... కేవలం శీఘ్రదర్శనమే'

ఇవీ చూడండి:రామమందిర నిర్మాణం ప్రారంభం ఆ రోజే!

ABOUT THE AUTHOR

...view details