సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని రాజన్న ఆలయం ముస్తాబైంది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీపాలతో అలంకరించారు.
విద్యుద్దీపాల వెలుగులో రాజన్న ఆలయం - RAJANNA SIRCILLA
మహాశివరాత్రికి రాజన్న ఆలయం ముస్తాబైంది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో మహాశివరాత్రి జాతర జరుగనున్న నేపథ్యంలో.. ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీపాలతో అలంకరించారు.
విద్యుద్దీపాల వెలుగులో రాజన్న ఆలయం
ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయ గోపురాలు.. దక్షిణ ద్వారం వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన విధులు విద్యుద్దీపాలతో కాంతులీనుతున్నాయి.
ఇదీ చూడండి:మూగ జీవాలకు తప్పని నీటి తిప్పలు