రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో ఫిబ్రవరి 25న హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. అప్పటి నుంచి వచ్చిన కానుకలను ఆలయ అధికారులు ఇప్పుడు లెక్కిస్తున్నారు.
కొనసాగుతున్న వేములవాడ రాజన్న హుండీ లెక్కింపు
వేములవాడ రాజన్న ఆలయంలోని హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రూ.41.88లక్షల నగదు, 45 గ్రాముల 30 మి.గ్రా. బంగారం, 5 కిలోల 300 గ్రాముల వెండి కానుకగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వేములవాడ రాజన్న హుండీ లెక్కింపు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మార్చి 20న మూసివేసిన రాజన్న ఆలయాన్ని జూన్ 10న తెరిచారు. గురువారం ప్రారంభమైన హుండీ లెక్కింపు ప్రక్రియ ఈరోజు కూడా కొనసాగుతుందని, ఇప్పటి వరకు జరిపిన లెక్కింపులో రూ.41.88లక్షల నగదు, 45 గ్రాముల 30 మి.గ్రా. బంగారం, 5 కిలోల 300 గ్రాముల వెండి కానుకగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొవిడ్ 19 వ్యాప్తి వల్ల ఆలయానికి భక్తుల సందర్శన తగ్గిందని, దాని ప్రభావం ఆలయ ఆదాయంపై పడినట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి:రూ.50 వేల దిగువకు చేరిన 10 గ్రా. పసిడి