రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రగతిభవ్లో మంత్రి కేటీఆర్‌తో వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పలు కార్యక్రమాల వివరాలను మంత్రికి అందించారు. వేములవాడ అభివృద్ధిపై సమీక్షించి పట్టణ అభివృద్ధికి పరిపాలనా అనుమతులు లభించిన 20 కోట్ల వ్యయంతో... పనులు ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. మంత్రికి ఎమ్మెల్యే రమేశ్ ధన్యవాదాలు తెలిపారు.
KTR: వేములవాడలో రూ.20 కోట్ల పనులు ప్రారంభించడానికి కేటీఆర్ ఆదేశాలు - వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కలిశారు. వేములవాడ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అందించారు. వాటిపై సమీక్షించి మంత్రి... అందుకు సంబంధించిన పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు.
vemulawada-mla-chennamaneni-ramesh-met-minister-ktr-for-permissions-to-development-works