రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఆది శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేశారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న కార్మికులు, పేదలు, వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మత్స్య కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాక్డౌన్ అమలులో దేశ ప్రధానమంత్రి మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల వలస జీవులు ఆగమయ్యారని, వారిని ప్రభుత్వ ఖర్చులతో సొంతగూటికి చేర్చాలని కోరారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వ గ్రాంట్స్తో పాటు.. ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు.
'పేదలకు కరువు సాయం రూ.10వేలు ఇవ్వాలి’ - Rajanna Siricilla news
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక చితికిపోయిన నిరుపేద కుటుంబాలకు రూ. 10వేలు అందించాలని కాంగ్రెస్ పార్టీ వేములవాడ ఇంఛార్జి ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు ఆర్థికంగా చితికిపోయారని, కేంద్ర ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

'పేదలకు కరువు సాయం రూ.10వేలు ఇవ్వాలి’