తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ - వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. హనుమాన్​ జయంతి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి తమ మెుక్కులు చెల్లించుకుంటున్నారు. కొండగట్టుకు బయలుదేరిన భక్తులు ఆనవాయితీగా రాజన్నను దర్శించుకుని అక్కడికి బయలుదేరారు.

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

By

Published : Apr 19, 2019, 11:21 AM IST

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

హనుమాన్ జయంతి సందర్భంగా జై శ్రీరామ్, ఓం నమశివాయ అంటూ హనుమాన్ భక్తుల నామస్మరణతో వేములవాడ రాజన్న ఆలయం మారుమోగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో రద్దీ నెలకొంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి ముందు ఆంజనేయ స్వామి భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.
భక్తులు తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. హనుమాన్ భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి కొండగట్టు ఆంజనేయ స్వామివారి దర్శనానికి బయలుదేరారు.

ABOUT THE AUTHOR

...view details