రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఈ నెల 21వ తేదీన మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం రోజు సూర్య గ్రహణం సంభవించడం వల్లే ఆలయాన్ని మూస్తున్నట్లు స్పష్టం చేశారు. సూర్య గ్రహణం ప్రభావం వల్ల రాజరాజేశ్వర స్వామి ఆలయంతోపాటు పట్టణంలోని అనుబంధ ఆలయమై బద్ది పోచమ్మ, భీమేశ్వర స్వామి ఆలయాలను కూడా మూసివేయనున్నారు.
21న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత - వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఈ నెల 21వ తేదీన మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ రోజు సూర్యగ్రహణం కావడం వల్లే ఆలయాన్ని మూస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 21న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత
తిరిగి 22వ తేదీ అంటే సోమవారం రోజున ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలపారు. ఉదయమే సంప్రోక్షణ చేసి యథావిధిగా భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!
TAGGED:
Solar Eclipse