ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో ఆలయం ప్రాంగణం సందడిగా మారింది. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుని తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ రాజన్న ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి క్యూలైన్లలో దర్శనం కోసం బారులు తీరారు. రద్దీ అధికంగా ఉండటం వల్ల అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేసి శీఘ్ర దర్శనాలను అమలుపరిచారు.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ