తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పూజలు

రాష్ట్రవ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు.... ఉత్తరద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

vaikunta ekadasi celebrations in vemulawada rajanna temple
రాజన్న ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి పూజలు

By

Published : Dec 25, 2020, 8:38 AM IST

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వారం నందు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. మంగళ వాయిద్యాలు, సుప్రభాతం, పల్లకి సేవ తదితర పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారంలో పూజలు నిర్వహించిన అనంతరం... స్వామివార్లను అంబారి సేవపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయం ముందు భాగంలో వైకుంఠ ఏకాదశి విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details