సిరిసిల్లకు 10 కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్-హరిదాసునగర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో అందమైన ఉద్యానవం రూపుదిద్దుకుంటోంది. 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ అర్బన్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో అటవీ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల అర్బన్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
సిరిసిల్లలో త్వరలో అందుబాటులోకి రానున్న అర్బన్ పార్క్ - telangana news
మంత్రి కేటీఆర్ సంకల్పంతో సిరిసిల్లలో అర్బన్ పార్క్ ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంటుంది. ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించడమే లక్ష్యంగా... ప్రభుత్వ సూచనలతో అటవీశాఖ అధికారులు దీనిని నిర్మిస్తున్నారు.
సిరిసిల్లలో త్వరలో అందుబాటులోకి రానున్న అర్బన్ పార్క్
ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పార్కును నిర్మిస్తున్నారు. యోగ కేంద్రం, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, ఉద్యానవనాలు, పిల్లల ఆటస్థలాలు, అడ్వెంచర్ గేమ్స్, ఫుడ్ కోర్టులు సహా మరిన్ని సౌకర్యాలతో పార్క్ నిర్మాణం జరుగుతోంది.
ఇదీ చూడండి:అనాథ శవాల ఆత్మబంధువు!