తెలంగాణ

telangana

By

Published : Aug 21, 2020, 8:57 PM IST

ETV Bharat / state

జలకళతో తొణికిసలాడుతున్న ఎగువ మానేరు!

సిరిసిల్ల నియోజక వర్గ జల ప్రదాయిని అయిన గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు వరద నీటితో పూర్తిగా నిండి జలకళను సంతరించుకుంది. గత పదిరోజులుగా కురుస్తున్న వానలకు జలాశయం నీటితో తొణికిసలాడుతున్నది. ఎగువ మానేరు అలుగు దూకితే.. మానేరు నది పారుతుంది అని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Upper Maneru Dam Fulled With Rain Water In Siricilla
జలకళతో తొణికిసలాడుతున్న ఎగువ మానేరు!

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావు పేట మండలం నర్మల శివారులోని ఎగువ మానేరు జలాశయం వరద నీటితో నిండింది. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచ, కూడవెల్లి వాగుల నుంచి భారీగా చేరిన వరద నీటితో ఎగువ మానేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. 31 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఎగు మానేరు శుక్రవారం తెల్లవారుజాము సమయానికి 31 అడుగులకు కేవలం 15 ఇంచులు మాత్రమే తక్కువ ఉంది. వరద ప్రవాహం కొనసాగితే.. జలాశయం అలుగు దూకి.. మానేరు నది పారడం ఖాయం అంటున్నారు స్థానికులు. చాలా రోజుల తర్వాత సిరిసిల్లలో మానేరు పారనుంది అని సిరిసిల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details