రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో విషాదం చోటుచేసుకొంది. శ్రీపాద ఎల్లంపల్లి కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
కాల్వలో పడి ఇద్దరు బాలికలు మృతి - Two girls died in rajanna siricill district
17:10 August 17
కాల్వలో పడి ఇద్దరు బాలికలు మృతి
స్థానిక గంగిరెద్దుల కాలనీకి చెందిన ముచ్చర్ల లావణ్య , ముచ్చర్ల అంజలి కాకర కాయలు తీసుకురావడానికి సమీపంలోని అటవీప్రాంతానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు శ్రీపాద ఎల్లంపల్లి కాల్వలో పడిపోయారు. బాలికల అరుపులు విని స్థానికులు కాల్వ వద్దకు చేరుకున్నారు. అప్పటికే వారు మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారుల అకాల మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇవీచూడండి: ఖిలా వరంగల్ ప్రాంతంలో పాత ఇల్లు కూలి వృద్ధుడు దుర్మరణం