తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మెలో పాల్గొన్న కార్మికుల అరెస్ట్ - TSRTC WORKERS

ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్ట్ చేసి ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీ బస్సులను నడిపించారు పోలీసులు.

సమ్మెలో పాల్గొన్న కార్మికుల అరెస్ట్

By

Published : Oct 5, 2019, 7:16 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఆర్టీసీ బస్సు డిపో ముందు కార్మికులు ధర్నాకి దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండే చేశారు. ప్రయాణ ప్రాంగణం వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులను అరెస్టు చేసి సిరిసిల్ల పోలీస్ స్టేషన్​కు తరలించారు. న్యాయమైన ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, నిలిచిపోయిన వేతనాలను చెల్లించాలని కార్మికసంఘం నాయకుడు లకావత్ రామిరెడ్డి కోరారు. కార్మికుల అరెస్ట్ తర్వాత ప్రైవేట్ డ్రైవర్, కండక్టర్​లతో పోలీస్ బందోబస్తు నడుమ ఆర్టీసీ బస్సులను నడిపించారు.

సమ్మెలో పాల్గొన్న కార్మికుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details