తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊడిపోయిన నట్లు.. ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం - ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల నట్లు ఊడిపోయి

ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల నట్లు ఊడిపోయినా... తాత్కాలిక డ్రైవర్​ చాకచక్యంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.

ఊడిపోయిన నట్లు.. ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

By

Published : Oct 23, 2019, 9:19 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్- సిరిసిల్ల నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు వెళ్తుండగా... ఒక్కసారిగా వెనుక టైరు నట్లు ఊడిపోయాయి. పెద్ద శబ్దం రావటం వల్ల తాత్కాలిక డ్రైవర్ ప్రమాదం జరగక ముందే బస్సును వెంకట్రావుపల్లి వద్ద నిలిపివేశాడు. ఆ సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణిస్తున్నారు. వారందరినీ మరో బస్సులో ఎక్కించారు. డ్రైవర్ అప్రమత్తంగా బస్సు నిలిపి వేయటం వల్లే ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పింది.

ఊడిపోయిన నట్లు.. ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details