రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో తెరాస 20వ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళ, తెరాస పట్టణ అధ్యక్షుడు చక్రపాణి గాంధీ చౌక్‌లో గులాబీ జెండా ఎగురవేశారు. అనంతరం పాత బస్టాండ్‌లో గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
సిరిసిల్లలో తెలంగాణ అమరవీరులకు నివాళి - trs party formation day in sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళ తెరాస ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. గాంధీ చౌక్ వద్ద తెరాస పట్టణ అధ్యక్షుడు చక్రపాణితో కలిసి తెలంగాణ అమర వీరుల స్థూపానికి నివాళి అర్పించారు.
సిరిసిల్లలో తెలంగాణ అమరవీరులకు నివాళి
తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో తెరాస మండల అధ్యక్షులు, గులాబీ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా తెరాస నాయకులు భౌతిక దూరం పాటిస్తూ నిరాడంబరంగా వేడుకలను జరుపుకున్నారు.