రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు వద్ద జలదీక్షకు వెళ్లిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు కౌశిక్‌రెడ్డి, పలువురు జిల్లా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారిని నిర్బంధించారు.
'అలా చేయకపోతే కేటీఆర్ రాజీనామా చేయాలి' - పొన్నం ప్రభాకర్ తాజా వార్తలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరుకు వెళ్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారిని నిర్బంధించారు.
పోలీసులు తమను అడ్డుకోవడం సరైంది కాదని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి గుర్తు చేసేందుకే జలదీక్ష చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేస్తోందని విమర్శించారు. జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ ఎగువ మానేరు ప్రాజెక్టును పూర్తి చేయించాలని.. లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఉత్తమ్