'మిడ్ మానేరు కట్టలో పగుళ్లు... ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం' - kodandaram says there are Irregularities in mid maneru project
మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు.
మిడ్‌మానేరు ప్రాజెక్టు సందర్శించిన రిటైర్డ్ ఇంజినీర్ల బృందం మానేరు కట్టలో పగుళ్లు వచ్చాయని చెప్పారని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఆ కట్టను పునర్నిర్మించాలని సూచించినట్లు గుర్తుచేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల అప్పు తెచ్చి నిర్మిస్తోన్న నీటి పారుదల ప్రాజెక్టుల్లో పగుళ్లు రావడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడంపై ఉన్న శ్రద్ధ, ప్రాజెక్టు నాణ్యతపై లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
- ఇదీ చూడండి : జంటనగరాల్లో భారీవర్షం... ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం