ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బుధవారం కోడె మొక్కుల టికెట్లు తిరిగి కొనుగోలు చేస్తూ ఓ ఉద్యోగి పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లాకు చెందిన సీహెచ్. సత్తయ్య, సిద్దిపేట జిల్లాకు చెందిన యాదవరెడ్డిలు కోడెమొక్కుల క్యూలైన్లో టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. ఆలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్ 4 టికెట్లను విక్రయించాడు. ఉచిత లడ్డూ తీసుకునే క్రమంలో టికెట్లు చెల్లవని సిబ్బంది చెప్పడం వల్ల ఎస్పీఎఫ్, ఆలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దొరికేశారు: రాజన్న ఆలయంలో 'కోడె' టికెట్ల రీసేల్! - రాజరాజేశ్వర ఆలయం తాజా వార్తలు వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కుల టికెట్లు తిరిగి కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు భక్తులకు ఆలయ రికార్డ్ అసిస్టెంట్ విజయ్ నాలుగు టికెట్లను విక్రయించాడు. అయితే ఉచిత లడ్డూ తీసుకునే క్రమంలో టికెట్లు చెల్లవని సిబ్బంది చెప్పడం వల్ల ఎస్పీఎఫ్, ఆలయ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
రాజన్న ఆలయంలో కోడె టికెట్ల రీసేల్..
దర్యాప్తు చేసిన అధికారులు అవి దొంగ టికెట్లుగా తేల్చారు. రికార్డ్ అసిస్టెంట్ విజయ్ నుంచి రూ. 5007 నగదు, కోడె టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. రికార్డ్ అసిస్టెంట్ విజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఏఈవో హరి కిషన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:నిధుల కేటాయింపులో జాప్యం... నెమ్మదించిన రాజన్న ఆలయ అభివృద్ధి