రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన భారీ వర్షానికి.. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన నేలకంటి సతీశ్ అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారం షెడ్డు నేల వాలింది. సుమారు 5 వేల కోళ్లకు సరిపడే షెడ్డు ఈదురు గాలులకు కూలిపోయింది. షెడ్డులో ఉన్న 3 వేలకు పైగా కోళ్లు మృతి చెందటంతో పాటు, సుమారు 15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ఆర్థికంగా నష్టపోయిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.
వర్షాలకు కోళ్ల ఫారం షెడ్డు కూలి 3 వేల కోళ్లు మృతి - వర్షానికి షెడ్డు కూలి కోళ్ల మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఓ కోళ్ల ఫారం షెడ్డు కూలి 3 వేల కోళ్లు మృతి చెందాయి. పలు ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.
Three thousand chickens were killed by a shed laborer in Rajanna Sircilla district
భారీ వర్షాల వల్ల మండలంలోని పలు ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతన్నలు కోరారు.