రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీరాజరాజేశ్వర పుణ్యక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఎనిమిదోరోజు అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబు చేసి.. విశేష పూజలు చేశారు. వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారికి ఆలయ ప్రాంగణంలోని ధర్మగుండంలో తెప్పోత్సవం నిర్వహించారు.
వేములవాడలో ఘనంగా అమ్మవారికి తెప్పోత్సవం - వేములవాడ
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆలయంలోని ధర్మగుండంలో తెప్పోత్సవం నిర్మించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ముస్తాబు చేసి.. భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
వేములవాడలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం
అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి.. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పల్లకిలో ధర్మగుండానికి తీసుకెళ్లారు. హంసవాహనంపై గుండంలో తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...ధరలు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో ఉల్లి అమ్మకాలు