తెలంగాణ

telangana

ETV Bharat / state

మిడ్ మానేరు ప్రాజెక్టుకు సీపేజ్ సమస్య - మిడ్ మానేరు ప్రాజెక్టుకు సీపేజ్ సమస్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల మధ్య మానేరు ప్రాజెక్టుకు మరో చోట సీపేజ్ ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామం వైపు గల ప్రాజెక్టు కట్ట నుంచి జలాలు ఉబికి వస్తున్నాయి.

the-seepage-problem-for-the-mid-maneru-project-in-rajanna-siricilla-district
మిడ్ మానేరు ప్రాజెక్టుకు సీపేజ్ సమస్య

By

Published : Dec 1, 2019, 6:13 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టు కుడివైపు గండి ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. గత నెలలో గోదావరి జలాల ఎత్తిపోతలతో సుమారు 20 టీఎంసీల జలాలు మధ్య మానేరు ప్రాజెక్టులో నిల్వ చేశారు. మొదటిసారి గోదావరి జలాల ఎత్తిపోతలతో ఆగస్టు నెలలో మాన్వాడ వైపు కట్టకు సీపేజ్ ఏర్పడింది.

ప్రాజెక్టు ఎడమవైపు వైపు గల కట్ట అడుగులో సున్నపురాయి ఉండటం వల్ల ఇటీవల మరమ్మతులు పూర్తి చేశారు. రెండోసారి 20 టీఎంసీల నీటిని నిల్వ చేయటం వల్ల రెండోవైపు కట్టకు సీపేజ్ ఏర్పడింది. తాజా పరిణామంతో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు.

మిడ్ మానేరు ప్రాజెక్టుకు సీపేజ్ సమస్య


ఇవీచూడండి: ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.. జీరో ఎఫ్​ఐఆర్​ ఉందిగా..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details