రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కల్యాణ లక్ష్మి పథకం చెక్కులను పంపిణీ చేశారు. రూ. 32 లక్షల 53 వేల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చులను కల్యాణలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోందని ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే ఈ పథకం నడుస్తోందని ఎమ్మెల్యే రవిశంకర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. లాక్డౌన్ కారంణంగా నష్టాలు వస్తున్నప్పటికి.. అది ప్రజల ఆరోగ్యం కోసమేనని స్పష్టం చేశారు. కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలా : హైకోర్టు