రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్ ఉండనుంది.
రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ.. ఉత్తర్వులు జారీ - wemulavada latest news
రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడను డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ.. ఉత్తర్వులు జారీ
వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, బోయిన్ పల్లి, కోనారావుపేట, రుద్రంగి మండలాలతో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడతో కలిపి రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 75కు చేరింది.
ఇదీ చూడండి:-రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!