పట్టుదలతో యోగాసనాలు వేస్తున్న ఈ బాలిక పేరు సృజన. సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక.. చిన్నతనం నుంచే యోగాసనాలు వేయడంలో నైపుణ్యం సాధించింది. పలుచోట్ల ప్రదర్శనలతో అవార్డులు సొంతం చేసుకొంది. ఓ సారి పోటీల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లినప్పుడు ఓ బాలిక నుదిటిపై దీపంతో యోగాసనాలు చేయడం ఆకర్షించింది. ఎంతో కష్టమని భావించినా.. పట్టుదలతో నేర్చుకొంది. గురువు శ్రీనివాస్ పర్యవేక్షణలో.. 15 రకాల ఆసనాలు వేయడంలో శిక్షణ తీసుకొని నైపుణ్యత సాధించింది.
YOGA: తొమ్మిదో తరగతిలోనే యోగాసనాలతో అబ్బురపరుస్తోన్న చిన్నారి..! - venkampeta srujana latest news
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోంది సిరిసిల్లకు చెందిన సృజన. చిన్ననాటి నుంచి యోగాసనాలు చేయడంలో దిట్టైన ఆమె ఆరో తరగతి నుంచే అద్భుత ప్రతిభతో అనేక పోటీల్లోనూ సత్తా చాటింది. శరీరాన్ని విల్లులా వంచుతూ ఔరా అనిపించే విధంగా ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తోంది.

YOGA: తొమ్మిదో తరగతిలోనే యోగాసనాలతో అబ్బురపరుస్తోన్న చిన్నారి..!
చిన్నారి ప్రతిభను చూసి తల్లిదండ్రులే ఆశ్చర్యపోతున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నా.. ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉంది. ఎవరైనా దాతలు ప్రోత్సహిస్తే దేశానికి మంచి పేరు తీసుకొస్తుందని కన్నవారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పోటీల్లో రాణించడంతో పాటు.. దేశం కోసం సైన్యంలో చేరతానంటున్న సృజన కల నెరవేరాలని మనమూ ఆశిద్దాం.
ఇదీ చూడండి: Murder: విద్యార్థినిని గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది