రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులో విషాదం జరిగింది. బస్ డిపో ప్రాంతం వద్ద వాగేశ్వరి స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
మద్యం మత్తులో డ్రైవర్..ముగ్గురు విద్యార్థులు మృతి - the-driver-of-the-intoxicated-bus
మద్యం మత్తులో డ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు విద్యార్థులు బలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈఘటనపై తెరాస కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మద్యం మత్తులో డ్రైవర్..ముగ్గురు విద్యార్థులు మృతి
బస్సు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిని మంత్రి ఈటల పరిశీలించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తెరాస కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న అమెజాన్ కార్చిచ్చు
Last Updated : Aug 28, 2019, 4:47 PM IST