రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మూలవాగుపై నిర్మిస్తున్న రెండో వంతెన కూలిపోయిది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మూలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెన శ్లాబ్‌కు అమర్చిన ఇనుప చువ్వలు విరిగిపోయి వంతెన కూలింది. రూ.28 కోట్లతో నిర్మిస్తున్న రెండు హై లెవెల్ బ్రిడ్జ్ పిల్లర్లు విరిగిపోయాయి. వంతెన నిర్మాణంలో వినియోగించే స్కాఫోల్డింగ్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. గుత్తేదారు నాణ్యతను విస్మరించినందునే విరిగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మూలవాగు ఉద్ధృతికి వేములవాడలో కూలిన వంతెన - The collapsed bridge at Vemulavada for the upliftment of the canals
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూల వాగు ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతికి వేములవాడలో వాగుపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది.
![మూలవాగు ఉద్ధృతికి వేములవాడలో కూలిన వంతెన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4496251-thumbnail-3x2-ppp.jpg)
The collapsed bridge at Vemulavada for the upliftment of the canals
Last Updated : Sep 20, 2019, 9:51 AM IST