తెలంగాణ

telangana

ETV Bharat / state

'మార్చి 31లోపు నిర్మాణాలు పూర్తి చేయాలి' - thangallapally mpp manasa

మార్చి 31లోపు 100 శాతం వైకుంఠ దామాలు, కంపోస్టు షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని సిరిసిల్ల జడ్పీ సీఈవో గౌతం రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్నారు.

thangallapally mandal parishath meeting
మండల పరిషత్​ సమావేశం

By

Published : Mar 12, 2020, 5:29 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో మండల పరిషత్ సమావేశం జరిగింది. సమావేశంలో జడ్పీ సీఈవో గౌతం రెడ్డి పాల్గొన్నారు. మార్చి 31 లోపు 100 శాతం వైకుంఠ దామాలు, కంపోస్టు షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మండల పరిషత్​ సమావేశం

హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. లక్ష్యం మేరకు పనులను పూర్తి చేసి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగెల మానస, ఎంపీడీవో మదన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు

ABOUT THE AUTHOR

...view details