తెలంగాణ

telangana

ETV Bharat / state

చెన్నమనేని కేసు: కేంద్ర హోంశాఖపై హైకోర్టు అసంతృప్తి - చెన్నమనేని వార్తలు

కేంద్ర ప్రభుత్వం తన పౌరసత్వాన్ని రద్దు చేయడంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ మెమో రూపంలో వివరాలు సమర్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

telangana-high-court-serious-on-central-home-ministry-on-chennamaneni-citizenship-issue
చెన్నమనేని కేసు: కేంద్ర హోంశాఖపై హైకోర్టు అసంతృప్తి

By

Published : Dec 16, 2020, 3:15 PM IST

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. చెన్నమనేని రమేశ్​కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. 2023 వరకు జర్మనీ పౌరసత్వాన్ని పొడిగించుకున్నారని తెలిపినకేంద్ర హోంశాఖ మెమో రూపంలో వివరాలు సమర్పించింది.

దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్​ రూపంలో వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ వివాదంపై విచారణను జనవరి 20వ తేదికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

ABOUT THE AUTHOR

...view details