'తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు'
'తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు' - tangallapalli villagers in rajanna siricilla district protest for drinking water
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహిళలు సిరిసిల్ల- సిద్దిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
!['తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3755533-thumbnail-3x2-water.jpg)
'తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు'
గత 20 రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భగీరథ పైప్లైన్ పగిలిపోవడం వల్ల కాలనీకి నీటి సరఫరా నిలిచి పోయిందని వాపోయారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు.
- ఇదీ చూడండి : పుర'పోరు'కు రంగం సిద్ధం