తెలంగాణ

telangana

ETV Bharat / state

మానేరు ప్రాజెక్టులో దూకిన వ్యక్తి.. రక్షించిన మత్స్యకారులు - suicide attempt in manner project

మొదట ఆత్మహత్య చేసుకునేందుకే జలాశయంలో దూకాడు. ఆ తర్వాత జీవితంపై పుట్టుకొచ్చి చెట్టు కొమ్మలను పట్టుకున్నాడు. ఆర్తనాదాలు చేస్తూ రక్షించమని వేడుకున్నాడు. దీన్ని గమనించిన మత్స్యకారులు అతన్ని కాపాడేందుకు యత్నించారు. చివరికి గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు.

suicide attempt person saved at manner project
మానేరు ప్రాజెక్టులో దూకిన వ్యక్తి.

By

Published : Oct 23, 2021, 9:05 PM IST

మానేరు ప్రాజెక్టులో దూకిన వ్యక్తి.. రక్షించిన మత్స్యకారులు

మానేరు జలాశయంలో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మత్స్యకారులు కాపాడారు. కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని కిసాన్​నగర్​కు చెందిన ముల్కల దేవయ్యగా అతన్ని గుర్తించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వంతెన వద్ద జరిగింది.

చెట్ల కొమ్మలు పట్టుకుని ఆర్తనాదాలు

మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చెట్ల కొమ్మలు పట్టుకుని రక్షించమంటూ ఆర్తనాదాలు చేశాడు. అతని అరుపులు విన్న మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని కాపాడేందుకు మొదట తెప్పల సాయంతో ప్రయత్నించారు. చెట్టు కొమ్మల సాయంతో రెండు గంటల పాటు భయంతో అలాగే జలాశయం ప్రవాహంలో ఉండిపోయాడు. చివరికి గజ ఈతగాళ్ల సాయంతో మత్స్యకారులు అతన్ని వెలికి తీశారు. రక్షించిన వారికి అతను కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:

గంజాయి రవాణాకు పాల్పడిన సర్పంచ్.. పదవి నుంచి తొలగింపు

ABOUT THE AUTHOR

...view details