తెలంగాణ

telangana

ETV Bharat / state

సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి - అధికారులతో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ సమీక్ష సమావేశం

రానున్న రోజుల్లో గ్రామాల్లో సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం అన్ని మండలాల అధికారులతో ఆయన సమావేశం జరిపారు. లాక్‌ డౌన్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలన్నారు.

Steps should be taken to prevent seasonal diseases in sircilla
సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

By

Published : May 24, 2020, 2:30 PM IST

గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. కలెక్టరేట్‌ నుంచి శనివారం అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీసీ నిర్వహించి సమీక్షించారు. పల్లెప్రగతి రెండు కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చే వర్షాకాల సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవాలన్నారు.

వ్యాప్తి కాకుండా చర్యలు

ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించాలని, నీరు నిలువ ఉన్న చోట శుభ్రపరిచి దోమలు వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్‌ యార్డులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలన్నారు. అనుమతి లేకుండా చెట్లను కొట్టే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో రవీందర్‌, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తనిఖీ చేసి..

తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద చెక్‌పోస్టును కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేయాలన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.

ఇదీ చూడండి :'అడవుల నరికివేత వల్లే కరోనా వైరస్​'

ABOUT THE AUTHOR

...view details