కొవిడ్(covid) మూడో దశ(third wave) వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని... ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధరణ పరీక్షలు పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీ సూచించారు. వ్యాక్సినేషన్(vaccination) ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో సమీక్షించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించారు.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఇంకా తగ్గలేదని... పూర్తి స్థాయిలో పాజిటివ్ కేసులు(positive cases) తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇంటింటి జ్వర సర్వేతో సత్ఫలితాలు సాధించామని, మరోసారి ఈ సర్వే చేయించాలని ఆయన ఆదేశించారు. వైరస్(virus) లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లలో లేదా హోమ్ ఐసోలేషన్(home isolation)లో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాజిటివ్ వచ్చిన వారికి మనోధైర్యం కల్పించాలని అన్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను సేకరించి వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.