రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రాములోరి కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు కల్యాణోత్సవం నిర్వహించారు. కన్యాదాతలుగా మరిగంటి గిరిధారాచార్యులు-మాధవి దంపతులు వ్యవహరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
వేములవాడలో నిరాడంబరంగా జగదానంద కారకుడి కల్యాణం - telangana varthalu
వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. కరోనా కట్టడి కోసం భక్తులు లేకుండానే జగదానంద కారకుడి కల్యాణాన్ని నిర్వహించారు.
వేములవాడలో నిరాడంబరంగా జగదానంద కారకుడి కల్యాణం
దేవస్థానం వారి తరఫున పట్టు వస్త్రాలను ఆలయ ఈవో కృష్ణప్రసాద్, ఏఈవో హరికిషన్తో పాటు పలువురు సమర్పించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిరాడంబరంగా, సాదాసీదాగా స్వామివారి కల్యాణం జరిగింది. కరోనా కట్టడి కోసం భక్తులు లేకుండానే జగదానంద కారకుడి కల్యాణాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి:భద్రాద్రిలో కనుల పండువగా సీతారాముల కల్యాణం