రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు చేశారు.
అశ్వ వాహనంపై స్వామివార్ల ఊరేగింపు - telangana news
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై ఊరేగించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుతున్నట్లు ఆలయ ఈవో హరి కిషన్ తెలిపారు.
![అశ్వ వాహనంపై స్వామివార్ల ఊరేగింపు Vemulawada Sri Ramanavami Navratri celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11433719-984-11433719-1618634022102.jpg)
అశ్వ వాహనంపై స్వామివార్ల ఊరేగింపు
సాయంత్రం సదస్యం పూజ కార్యక్రమాలు చేశారు. రాత్రి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల అనంతరం... అశ్వవాహనంపై ఉంచి ఆలయంలోపలే ఊరేగించారు.
ఇదీ చదవండి:మీకు తెలుసా.. అక్కడ ఆడవాళ్ల పుస్తకాలే ఉంటాయి ఎందుకంటే?