తెలంగాణ

telangana

ETV Bharat / state

శివరాత్రి వేడుకలకు హాజరు కావాలని మంత్రికి ఆహ్వానం! - తెలంగాణ వార్తలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే మహా శివరాత్రి వేడుకలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. దేవస్థాన ఈవో కృష్ణ ప్రసాద్ మంత్రికి ఆహ్వాన పత్రికను అందించారు. మంత్రిని వేదపండితులు ఆశీర్వదించి... ప్రసాదాలు అందజేశారు.

sri rajarajeswara swamy temple ec invites minister indrakaran reddy for maha shivratri celebrations in nirmal
శివరాత్రి వేడుకలకు హాజరు కావాలని మంత్రికి ఆహ్వానం!

By

Published : Mar 7, 2021, 3:32 PM IST

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే మహా శివరాత్రి మహోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. నిర్మల్ పట్టణం శాస్త్రినగర్​లోని ఆయన నివాసంలో దేవస్థాన ఈవో కృష్ణ ప్రసాద్ ఆహ్వాన పత్రికను అందించారు. తొలుత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని వేదపండితులు ఆశీర్వదించి... ప్రసాదాలను అందజేశారు. అనంతరం శివరాత్రి వేడుకలకు హాజరుకావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details