ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు మన ఊర్లో ఉన్న బడిని మనమే కాపాడుకోవాలని రఘోత్తమ్ రెడ్డి ప్రజలకు సూచించారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి - srcl-mlc-badibata
రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లిలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని తెలిపారు.
బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి
TAGGED:
srcl-mlc-badibata