ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారికి ఉదయం విశేష పూజలు నిర్వహించారు.
రాజన్న ఆలయంలో శ్రావణ శుక్రవార ప్రత్యేక పూజలు - శ్రావణ శుక్రవారం విశిష్టత
శ్రీవేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుంచే విశేష పూజలు నిర్వహించారు.
శ్రావణశుక్రవారం సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆలయంలో కొవిడ్ నిబంధనల మేరకు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. స్క్రీనింగ్ చేసిన తర్వాతే క్యూలైన్లలో భక్తులను అనుమతిస్తున్నారు. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి... శీఘ్ర దర్శనం అమలుచేస్తున్నారు. పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: 'రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'