ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయంలోని శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి ఉదయం, సాయంత్రం చతుషష్టి ఉపచారములు విశేషపూజలు చేపట్టారు.
రాజన్న ఆలయంలో శ్రావణశుక్రవారం ప్రత్యేక పూజలు - Rajanna Temple news
రాజన్న ఆలయంలో శ్రావణశుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి ఉదయం, సాయంత్రం చతుషష్టి ఉపచారములు, విశేషపూజలు చేపట్టారు.
![రాజన్న ఆలయంలో శ్రావణశుక్రవారం ప్రత్యేక పూజలు Special pujas on Shravanashukravaram at Rajanna Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8335004-291-8335004-1596816473019.jpg)
రాజన్న ఆలయంలో శ్రావణశుక్రవారం ప్రత్యేక పూజలు
పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక అభిషేకము, అర్చనతో పాటు శ్రీ మహాలక్ష్మీ హోమం చేశారు. భక్తులు కొవిడ్ నిబంధనల మేరకు దర్శనం చేసుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ స్థానాచార్యులు అప్పల భీమాశంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్