రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - రాజన్న సిరిసిల్లి జిల్లా తాజా వార్తలు
వేములవాడ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో రేవతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకాలు చేశారు.

శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కొవిడ్ విస్తరిస్తున్న కారణంగా... తగిన నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనాలకు అనుమతించారు. ఆర్జిత సేవలు రద్దు చేసి... శీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు