రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మూడో రోజు లాక్డౌన్ కొనసాగుతోంది. ఎస్పీ రాహుల్ హెగ్డే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా, పాతబస్టాండ్, వెంకపేట్, సుందరయ్య నగర్, బి.వై నగర్, ఇందిరానగర్, కొత్త బస్టాండ్ ప్రాంతలాల్లో పర్యటించారు.
లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారు: ఎస్పీ రాహుల్ హెగ్డే
లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులకు జరిమానా విధించాల్సిందిగా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా పరిధిలో చాలా కఠినంగా అమలు అవుతుందన్నారు. అన్ని వర్గాల వారు ఈ లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన 280 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు, 12 దుకాణలపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. ఎస్పీతో పాటు డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్