తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ జలాశయం వద్దకు వెళ్లొద్దు: ఎస్పీ - Do not go around the reservoir

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండి పొంగిపోర్లుతోంది. ఈ తరుణంలో ప్రజలు, యాత్రికులు జలాశయంను సందర్శించడానికి వెళ్లకూడదని ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. ప్రజలు గమనించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.

sp rahul hegde,  narmala eguva reservoir
ఆ జలాశయం వద్దకు వెళ్లొద్దు: ఎస్పీ

By

Published : Apr 21, 2021, 12:57 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయం పూర్తి స్థాయిలో నిండింది. ఈ నేపథ్యంలో ప్రజలు, యాత్రికులు ఆ జలాశయం సందర్శనకు వెళ్లకూడదని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విజ్ఞప్తి చేశారు.

నర్మాల ఎగువ మానేరు జాలశయం నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకుతుందన్నారు. జలాశయం వద్దకు ఎవరూ కూడా వెళ్లరాదని ఎస్పీ రాహుల్ హెగ్డే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఫోటోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. జలాశయం పరిసరాల్లో మద్యపానం సేవించరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి :కరోనా పంజా: రాష్ట్రంలో మరో 6,542 కొవిడ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details