కన్న తల్లి మరణం జీర్ణించుకోలేక తనయుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకోంది. ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన బొల్లం రాకేశ్ తల్లి లక్ష్మి క్యాన్సర్ వ్యాధితో ఏడాది క్రితం చనిపోయింది. అప్పటి నుంచి యువకుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. తండ్రి వైకల్యంతో ఇంటి వద్దనే ఉండటం, పెళ్ళికి ఎదిగిన చెల్లెలు కూడా ఉండటం తన ఆర్థిక స్థోమతకు భారంగా భావించి తీవ్ర మనోవ్యధకు గురయ్యేవాడని పేర్కొన్నారు.
తల్లి మరణం తట్టుకోలేక.. కుమారుడి సెల్ఫీ ఆత్మహత్య - రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతారం
కన్న తల్లి మరణం తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితం మీద విరక్తి పుట్టిందని.. తల్లి వద్దకే వస్తున్నానంటూ కంటతడితో సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తల్లి మరణం తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య
ఈ క్రమంలో తల్లి అంత్య క్రియలు జరిగిన స్థలంలో జీవితం మీద విరక్తి పుట్టిందని తన తల్లి వద్దకే వస్తున్నానని కంటతడితో సెల్ఫీ తీసుకున్నాడు. చెల్లిని బాగా చూసుకోవాలని , మద్యానికి బానిస కావద్దంటూ తండ్రికి సూచించి పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఇల్లంతకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:నాలుగు బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం