తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లి అంత్యక్రియల్లో తనయుడి పాట!

మరణించిన తన తల్లికి వినూత్న రీతిలో అంత్యక్రియలు నిర్వహించారు ఓ తనయుడు. అమ్మతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పాట పాడుతూ తల్లికి కడసారి నివాళులు అర్పించారు. తన తల్లితో పెనవేసుకున్న ఆ బంధాన్ని పాట రూపంలో చెప్పడం స్థానికులను కదిలించింది.

son-sang-a-song-in-his-mother-funerals-at-ramalakshmanapally-in-rajanna-sircilla-district, తల్లి అంత్యక్రియల్లో తనయుడి పాట!
తల్లి అంత్యక్రియల్లో తనయుడి పాట!

By

Published : Jan 8, 2021, 11:38 AM IST

తల్లితో ఉన్న అనుబంధాన్ని అంత్యక్రియల సందర్భంగా వివరిస్తూ ఓ తనయుడు పాడిన పాట స్థానికులను కన్నీరు పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తల్లి రాజవ్వ మృతి చెందారు.

తన తల్లిని స్మరిస్తూ ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పాట రూపంలో తల్లికి కడసారి నివాళులు అర్పించి... అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులతో పాటు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

తల్లి అంత్యక్రియల్లో తనయుడి పాట!

ఇదీ చదవండి:వివాహ బంధం వద్దని... విడాకులే కావాలని

ABOUT THE AUTHOR

...view details