తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వాతంత్రోద్యమ నేత అనుముల నర్సయ్యకు రాష్ట్రపతి తరఫున ఘన సన్మానం - solid felicitation Anumula Narsayya Latest News

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల పరిధిలోని నిమ్మపల్లికి చెందిన స్వాతంత్రోద్యమ నేత అనుముల నర్సయ్యను ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రపతి తరఫున సన్మాన గ్రహిత ఇంటికెళ్లిన జడ్పీ ఛైర్మన్ జిల్లా అధికారులు నర్సయ్యను శాలువతో సత్కరించారు.

స్వాతంత్రోద్యమ నేత అనుముల నర్సయ్యకు రాష్ట్రపతి తరఫున ఘన సన్మానం
స్వాతంత్రోద్యమ నేత అనుముల నర్సయ్యకు రాష్ట్రపతి తరఫున ఘన సన్మానం

By

Published : Aug 9, 2020, 5:23 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన స్వాతంత్రోద్యమ నేత అనుముల నర్సయ్యకు క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రపతి తరపున వస్త్రం, శాలువతో జడ్పీ ఛైర్మన్ న్యాలకొండ అరుణ, జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య ఆదివారం ఘనంగా సన్మానించారు.

ఏటా రాష్ట్రపతి భవన్​లోనే...

ఏటా దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో క్విట్ ఇండియా దినోత్సవం ఆగస్ట్ 9 సందర్భంగా స్వాతంత్రోద్యమ యోధులను ఘనంగా సన్మానిస్తారు.

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో...

కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్వాతంత్రోద్యమ నేతలను వారి నివాసాల్లోనే రాష్ట్రపతి తరపున సన్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్​లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో అనుముల నర్సయ్యను రాష్ట్రపతి తరపున జడ్పీ చైర్మన్ శ్రీమతి అరుణ, జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య ఘనంగా సన్మానించారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 1,982 కరోనా కేసులు... 12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details